ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్టీసీలో డబుల్​క్రూకు స్వస్తి.. ఆదేశాలు జారీ

ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న డబుల్​క్రూ విధానానికి స్వస్తి పలికి.. సింగిల్​క్రూ విధానంలోనే బస్సులను నడపాలని ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్ల కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

apsrtc
సింగిల్​క్రూ ఆదేశం

By

Published : Dec 24, 2020, 5:37 AM IST

ఆర్టీసీ సిబ్బంది భారంగా పరిగణించేలా ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. పలు బస్సుల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న డబుల్​క్రూ విధానానికి స్వస్తి చెప్పింది. ఇకపై సింగిల్​క్రూ విధానంలోనే బస్సులు నడపాలని అన్ని జిల్లాల అధికారులకు ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం డబుల్​క్రూ విధానం ప్రకారం ఒక డ్రైవర్,ఒక కండక్టర్ ఒక షిఫ్టులో మాత్రమే పని చేస్తున్నారు. ఇకపై సింగిల్​క్రూ విధానం అమలు వల్ల సిబ్బంది అదనంగా వరుసగా మరో డ్యూటీ చేయాల్సి ఉంటుంది. సింగిల్​క్రూతో డబుల్ డ్యూటీలు చేయాల్సిరావడంతో ఆరోగ్యం దెబ్బతింటోందని గతంలో కార్మిక సంఘాలు ఆందోళన చేశాయి. చాలా చోట్ల సిబ్బంది ఆందోళనకు దిగడంతో కొవిడ్ సమయంలో పక్కన పెట్టారు. కొంత కాలానికే తిరిగి గతంలో అవలంబించిన విధానాన్ని అమలు చేయాలని ఎండీ ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీలో డ్రైవర్ల కొరత ఉండటం వల్లే సింగిల్​క్రూ విధానం అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆదేశాల్లో ఎండీ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details