రాజోలిబండ (ఆర్డీఎస్) కుడి కాలువ పనులు చేపట్టవద్దంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏపీ ఈఎన్సీ (ఇంజినీర్ ఇన్ చీఫ్) కు లేఖ రాసింది. బోర్డుకు డీపీఆర్ ఇవ్వకుండా, ఆమోదం పొందకుండా పనులు చేయొద్దని కేఆర్ఎంబీ బోర్డు సభ్య కార్యదర్శి హరికేష్ మీనా స్పష్టం చేశారు.
ఆర్డీఎస్ కుడి కాలువ పనులు చేపట్టొద్దు: ఏపీ ఈఎన్సీకి KRMB లేఖ - RDS Krishna River Board not to undertake right canal works

20:15 July 15
ఏపీ ఈఎన్సీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ
రాజోలిబండ నీటి మళ్లింపు పథకం కుడి కాలువ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1980 కోట్లు విడుదల చేసింది. కాంట్రాక్టులు దక్కించుకున్న గుత్తేదార్లు.. కర్నూలు జిల్లా కోసిగి, పెద్దకడబూరు మండలాల్లో మార్చి 24న భూమిపూజ నిర్వహించారు. అప్పటి నుంచి కాలువ పనులు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంతో.. పనులు నిలిపివేయాలని కేఆర్ఎంబీ తాజాగా ఆదేశాలిచ్చింది.
ఇదీ చదవండి:
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై... రేపు గెజిట్ విడుదల