ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకోనున్న ప్రాథమిక పాఠశాలలు - ఫిబ్రవరి 1 నుంచి ప్రాథమిక పాఠశాలలు పునఃప్రారంభం

కరోనా నిబంధనలు పాటిస్తూ.. ప్రాథమిక పాఠశాలలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీతో.. తరగతి గదికి 20 మందినే అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. గదులు సరిపోనిపక్షంలో ప్రత్యామ్నాయ రోజుల్లో తరగతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

primary schools open from 1st february
ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకోనున్న ప్రాథమిక పాఠశాలలు

By

Published : Jan 29, 2021, 8:00 PM IST

ఫిబ్రవరి 1నుంచి ప్రాథమిక పాఠశాలలు తెరవనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. విద్యార్థుల సంఖ్య, తరగతి గదుల ఆధారంగా విద్యాలయాలను నిర్వహిస్తామన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతులు జరుపుతామని పేర్కొన్నారు. తరగతి గదిలో 20 మంది విద్యార్థులనే ఉంచనున్నట్లు మంత్రి వెల్లడించారు. గదులు సరిపోనిచోట ప్రత్యామ్నాయ రోజుల్లో తరగతులు నిర్వహిస్తామన్నారు. తల్లిదండ్రుల లిఖితపూర్వక హామీతోనే విద్యార్థులను అనుమతిస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details