ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యుత్ ఉద్యోగుల విభజన కేసు: నవంబర్ 2కు వాయిదా

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన కేసు సుప్రీంకోర్టులో నవంబర్ 2కి వాయిదా పడింది. ఉద్యోగుల విభజనపై 2019 డిసెంబర్​లో జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికను అందరూ అంగీకరించగా... ఏపీ సంస్థలు చిన్నపాటి సవరణలు కోరాయని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కమిటీ నివేదిక తెలంగాణను మోసం చేసేలా ఉందని... వివాదంలో లేని 584 ఉద్యోగులను కొత్తగా రాష్ట్రానికి కేటాయించారని తెలంగాణ విద్యుత్ సంస్థల తరఫు న్యాయవాదులు వివరించారు.

జస్టిస్ ధర్మాధికారి నివేదికను పక్కనపెట్టాలని విజ్ఞప్తి
జస్టిస్ ధర్మాధికారి నివేదికను పక్కనపెట్టాలని విజ్ఞప్తి

By

Published : Oct 12, 2020, 9:42 PM IST

తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన కేసు సుప్రీంకోర్టులో నవంబర్ 2కి వాయిదా పడింది. ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన ముగింపు నివేదికపై... అభ్యంతరం వ్యక్తం చేస్తు తెలంగాణ జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలు, ఏపీ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ అశోక్ భూషణం ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. తెలంగాణ విద్యుత్ సంస్థల తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, రాకేష్ ద్వివేది, వి.గిరి వాదనలు వినిపించారు. ఉద్యోగుల విభజనపై 2019 డిసెంబర్​లో జస్టిస్ ధర్మాధికారి కమిటీ నివేదికను అందరూ అంగీకరించగా... ఏపీ సంస్థలు చిన్నపాటి సవరణలు కోరాయని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

కమిటీ నివేదిక తెలంగాణను మోసం చేసేలా ఉందని... వివాదంలో లేని 584 ఉద్యోగులను కొత్తగా రాష్ట్రానికి కేటాయించారని తెలంగాణ విద్యుత్ సంస్థల తరఫు న్యాయవాదులు వివరించారు. జస్టిస్ ధర్మాధికారి కమిటీ ముగింపు నివేదికను పక్కన పెట్టాలని కోరారు. ఏపీ సంస్థలు రిలీవ్ చేసిన ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు లేవని... తమకు న్యాయం చేసేలా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని ఉద్యోగుల తరపు న్యాయవాది బాలసుబ్రమణ్యన్ కోరారు. ఇప్పుడు ఆదేశాలు ఇవ్వలేమని... సెలవుల తర్వాత నవంబర్ 2న మిగిలిన వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:

మోటర్లకు మీటర్లతో.. రైతులపై భారం పడదు: సీఎం

ABOUT THE AUTHOR

...view details