ఏజన్సీలకే 'నాడు-నేడు’ పనులు - నాడు-నేడు’ పనుల్లో మార్పు
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించే ‘నాడు-నేడు’ పనుల్లో ఉన్నతాధికారులు మార్పులు చేయనున్నారు. పనులకు సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం లభించినందున కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన ‘నాడు-నేడు’ పనుల నిర్వహణలో ప్రభుత్వం మార్పులు చేయనుంది. ప్రస్తుతం తల్లిదండ్రుల కమిటీలతో నిర్వహిస్తున్న ఈ పనులను ఉపాధిహామీ పథకం పనుల తరహాలో ఏజెన్సీలకు అప్పగించనున్నారు. పనుల్లో జాప్యం జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ‘నాడు-నేడు’ పనులపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో పనుల ప్రగతిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పనులు చేసే ఏజెన్సీతో తల్లిదండ్రుల కమిటీ, ఇంజినీరింగ్ విభాగం ఒప్పందం కుదుర్చుకుంటాయి. పనులను తల్లిదండ్రుల కమిటీ పర్యవేక్షిస్తుంది. పనులకు సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం లభించినందున కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.