ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కొత్త ఇసుక రీచ్​లకు త్వరగా అనుమతి తీసుకోవాలి' - ఏపీలో ఇసుక కార్పొరేషన్ న్యూస్

ఇసుక కార్పొరేషన్ విధి విధానాలపై మంత్రుల కమిటీ చర్చించింది. సాంకేతిక పరిజ్ఞానంతో ఇసుక లభ్యతను గుర్తించడం ద్వారా కొత్త రీచ్‌లకు అనుమతులు ఇవ్వాలని అభిప్రాయపడింది. ఎక్కువ ఇసుక రీచ్​ల ద్వారా సులువుగా ఇసుక సరఫరా కార్యాచరణపై చర్చించారు.

'కొత్త ఇసుక రీచ్​లకు వేగంగా అనుమతి తీసుకోవాలి'
'కొత్త ఇసుక రీచ్​లకు వేగంగా అనుమతి తీసుకోవాలి'

By

Published : Oct 8, 2020, 6:29 PM IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన ఇసుక కార్పొరేషన్​పై విజయవాడలో మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, గనులశాఖ ముఖ్య కార్యదర్శి హాజరయ్యారు. ఇసుక కార్పొరేషన్ విధి విధానాలపై చర్చించిన మంత్రుల కమిటీ.. కొత్త రీచ్‌లకు పర్యావరణ నియంత్రణ మండలి అనుమతులు వేగంగా తీసుకోవాలని నిర్ణయించింది.

జిల్లా యూనిట్‌గా ఇసుక డిమాండ్, సరఫరాపై కమిటీ నిర్ణయం తీసుకుంది. జిల్లా స్థాయిలో ఇసుక రీచ్‌లపై సమగ్ర మ్యాప్‌లను తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో సంయుక్త కలెక్టర్లతో సమన్వయం చేసుకునేలా సూచనలు చేసింది. స్టాక్‌ యార్డ్‌ల నుంచి సకాలంలో ఇసుక సరఫరాపై సూచనలు ఇచ్చిన కమిటీ.. ఇతర రాష్ట్రాల్లోని విధానాలు, లోటుపాట్లపై చర్చించింది.

ABOUT THE AUTHOR

...view details