ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Peddireddy: 'ప్రభుత్వ ఆదాయానికి ఆ వనరులు కీలకం.. సద్వినియోగం చేసుకోండి'

గనుల శాఖ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఖనిజవనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

ప్రభుత్వ ఆదాయానికి ఆ వనరులు కీలకం..సద్వినియోగం చేసుకోండి
ప్రభుత్వ ఆదాయానికి ఆ వనరులు కీలకం..సద్వినియోగం చేసుకోండి

By

Published : Aug 24, 2021, 8:14 PM IST

రాష్ట్రంలో ఖనిజవనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌ కమిషనర్ కార్యాలయంలో గనుల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అపారమైన ఖనిజ సంపద ఉన్నందున..,వాటిని వినియోగించుకోవటం ద్వారా పారిశ్రామిక ప్రగతికి, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. సిలికా శాండ్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. గనుల శాఖలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా సీఎం జగన్ ఆదేశాల మేరకు పారదర్శక విధానాలను తీసుకువచ్చామని తెలిపారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు, ఈ-పర్మిట్ విధానం ద్వారా ఎటువంటి జాప్యం లేకుండా అనుమతులు మంజూరు చేస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు. గనుల లీజు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల గతేడాది కంటే ఈ ఏడాది ఆదాయం పెరుగుతుందన్నారు. ఈ మేరకు అధికారులు కూడా బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఏపీఎండీసీ ద్వారా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రాజెక్ట్‌లను ప్రారంభించామని..,వాటి ద్వారా కూడా అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతుందని అధికారులు మంత్రికి వివరించారు. సిలికా శాండ్, కాల్సైట్, ఐరన్ ఓర్, గ్రానైట్ ఖనిజాలను వెలికితీయటం ద్వారా ఖనిజాధారిత రెవెన్యూ వనరులను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details