ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 14, 2021, 5:39 PM IST

ETV Bharat / city

Marreddy srinivas reddy: రైతు సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు

పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక, మార్కెటింగ్ సదుపాయాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు తెలుగు రైతు పార్లమెంట్ అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.

marreddy srinivas reddy
రైతు సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు

రైతు సమస్యల పరిష్కారానికి ఈ నెల 21న అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు.. తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక, మార్కెటింగ్ సదుపాయాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు తెలుగు పార్లమెంట్ అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం బకాయిలు సకాలంలో జమ కాక.. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడించారు. రైతు సమస్యలను పరిష్కరించాలని.. కలెక్టర్లకు తెలుపుతామని పేర్కొన్నారు. సుబాబుల్, పొగాకు, అరటి, ఇతరత్రా పంటలతో పాటు, జీడి పంటలకు సరైన మార్కెటింగ్ లేదన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సీడీ చెల్లింపుల్లోనూ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకు రుణాల అందచేతలోనూ అనేక సమస్యలు ఉన్నాయని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details