ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాక్​డౌన్ అతిక్రమణ...వాహనదారులపై కేసులు - విజయవాడలో లాక్​డౌన్ అతిక్రమణ

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే వాననాలపై విజయవాడ పోలీసులు కేసులు నమోదు చేసి జరిమానాలు వసూలు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

లాక్​డౌన్ అతిక్రమణ
లాక్​డౌన్ అతిక్రమణ

By

Published : Apr 12, 2020, 11:41 AM IST

విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లాక్​డౌ​న్ అమలులో ఉన్నా...యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అనుమతించిన సమయంలో కాకుండా మిగతా సమయాల్లో రోడ్లపైకి వచ్చే వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. ఎన్టీఆర్ సర్కిల్​ ప్రాంతాల్లో ఉదయం 9 తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. 9 గంటల తర్వాత అత్యవసర సేవలందిస్తున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. వారు కూడా కచ్ఛితంగా గుర్తింపుకార్డులు చూపిస్తేనే అనుమతిస్తామన్నారు. లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details