ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 26, 2021, 4:45 PM IST

ETV Bharat / city

ప్రముఖ రచయిత వెల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

తెలుగువాడైన ప్రముఖ రచయిత వెల్చేరు నారాయణరావుకు అరుదైన గౌరవం లభించింది. ఆయన సాహితీ సేవలకు గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది.

ప్రముఖ రచయిత వెల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
ప్రముఖ రచయిత వెల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ప్రముఖ రచయిత వెల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఆయన సాహితీ సేవలకు గుర్తింపుగా కేంద్రం ఈ అవార్డుతో సత్కరించింది. పరిశోధకుడు, అనువాదకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెల్చేరు...ప్రసిద్ధ తెలుగు కావ్యాలను ఆంగ్లంలోకి అనువదించారు. శ్రీకాళహస్తీశ్వరా శతకం, బసవపురాణం, క్రీడాభిరామం, కళాపూర్ణోదయం, కాళిదాసు విక్రమోర్వశీయం, అన్నమయ్య, క్షేత్రయ్య సాహిత్యాన్ని ఆయన ఆంగ్లంలోకి అనువదించారు. అమెరికాలో సుదీర్ఘకాలం తెలుగు ఆచార్యుడిగా వెల్చేరు పనిచేశారు. వెల్చేరు నారాయణరావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని కొప్పాక గ్రామం.

ABOUT THE AUTHOR

...view details