ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మొదటి కార్తీక శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు - కార్తీక శుక్రవారం ప్రత్యేక పూజలు

కార్తీక మాసం పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల సుబ్రమణ్యస్వామి కల్యాణం నిర్వహించారు. కొవిడ్ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. కార్తీక మాసంలో మొదటి శుక్రవారం భక్తలు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

karthika masam pujalu
మొదటి కార్తీక శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు

By

Published : Nov 20, 2020, 8:29 PM IST

కృష్ణా జిల్లాలో..

కార్తీకమాసం షష్టి తిథిని పురస్కరించుకుని విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో సుబ్రమణ్యస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానంలోని నటరాజ స్వామి మండపంలో సుబ్రమణ్యస్వామి కల్యాణం నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.వి సురేశ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లాలో..

ధనురాశి నుంచి మకరరాశిలోకి గురు సంక్రమణ నేపథ్యంలో శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురు దక్షిణామూర్తికి ఏకాంత ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారికి అభిషేకాలు, హోమం నిర్వహించారు. కొవిడ్ కారణంగా ఈ ఏడాది భక్తులకు అనుమతి ఇవ్వలేదు.

కార్తీక మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని తిరుపతిలో అక్కగార్ల దేవతలకు పూజలు నిర్వహించారు. మొదటి ఘాట్ రోడ్డులో ఉన్న ఏడుగురు అక్కగార్ల దేవతలకు స్థానికులు, తితిదే రవాణా విభాగం నేతృత్వంలో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. అమ్మవార్లకు విశేషంగా పూజ‌లు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.

తిరుపతిలో...

తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యస్వామి హోమం ముగిసింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా ప్ర‌త్యేక కార్య‌మాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యాగశాలలో పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. ‌

ఇదీ చూడండి:

తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొన్న సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details