ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్, విజయసాయి వాదనలు ఆఖరున వింటాం: సీబీఐ,ఈడీ కోర్టు

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ ఛార్జ్‌షీట్‌లో అభియోగాల నమోదుపై సీబీఐ వాదనలు వినిపించింది. పెన్నా, భారతీ సిమెంట్స్ కేసుల్లో జగన్, విజయసాయి వాదనలు ఆఖరున వింటామన్న న్యాయస్థానం....మిగతా నిందితులు వాదనలు వినిపించాలని తెలిపింది.

Hyderabad cbi, ed court on jagan case
జగన్, విజయసాయి వాదనలు ఆఖరున వింటాం

By

Published : Jan 12, 2021, 6:17 PM IST

హైదరాబాద్​ సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ ఛార్జ్‌షీట్‌లో అభియోగాల నమోదుపై సీబీఐ వాదనలు వినిపించింది. జగతి పబ్లికేషన్స్, రాంకీ, వాన్‌పిక్ అభియోగ పత్రాల విచారణ ఈనెల 19కి వాయిదా పడగా....భారతీ సిమెంట్స్ ఛార్జ్‌షీట్‌లో అభియోగాల నమోదుపై విచారణ ఈనెల 20కి వాయిదా వేశారు. పెన్నా ఛార్జ్‌షీట్‌లో అభియోగాల నమోదుపై విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది. పెన్నా, భారతీ సిమెంట్స్ కేసుల్లో జగన్, విజయసాయి వాదనలు ఆఖరున వింటామన్న న్యాయస్థానం....మిగతా నిందితులు వాదనలు వినిపించాలని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details