చందన బ్రదర్స్ అతిథిగృహానికి నోటీసులపై హైకోర్టు స్టే - చందన బ్రదర్స్
సీఆర్డీఏ నోటీసుల వివాదం హైకోర్టుకు చేరింది. చందన బ్రదర్స్ అతిథిగృహానికి ఇచ్చిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది.

చందన బ్రదర్స్ అతిథిగృహానికి సీఆర్‌డీఏ నోటీసులపై హైకోర్టు స్టే
కృష్ణా నదీ తీరంలోని చందన బ్రదర్స్ అతిథిగృహానికి సీఆర్‌డీఏ నోటీసులు ఇచ్చిన విషయం విదితమే! దీనిపై చందన బ్రదర్స్ హైకోర్టును ఆశ్రయించింది. అసలు... సీఆర్డీఏకి నోటీసులు ఇచ్చే అధికారమే లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. సీఆర్డీఏ చట్టం రాకముందే భవనాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. అనుమతులు లేకుంటే జరిమానాలు విధించొచ్చని.. కానీ కూల్చడం సరికాదన్నారు.
చందన బ్రదర్స్ అతిథిగృహానికి సీఆర్‌డీఏ నోటీసులపై హైకోర్టు స్టే