ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 23, 2022, 10:08 PM IST

ETV Bharat / city

ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పొడిగింపు

Bail Extended ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్​ను సెప్టెంబన్​ 5 వరకు పొడిగిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు అనంతబాబుకు మూడు రోజులు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

ఎమెల్సీ అనంతబాబు బెయిల్ పొడగింపు
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పొడగింపు

MLC Ananthbabu Bail Extended ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్​ను వచ్చే నెల 5 వరకు పొడిగిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కోర్టు ఇచ్చిన బెయిల్​ను పొడిగించాలని అనంతబాబు వేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తల్లి మరణించడంతో ఆమె పెద్దకర్మ అయ్యే వరకూ బెయిల్‌ పొడిగించాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్​ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు అనంతబాబుకు మూడు రోజులు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది మే 19న దళిత యువకుడు, ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య జరగ్గా.. ఆ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును మే 23న పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి అనంతబాబు రిమాండ్​లో ఉన్నారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details