ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 21, 2020, 8:57 PM IST

ETV Bharat / city

మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలకు అదనపు శాఖ బాధ్యతలు

మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల శాఖలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల బాధ్యతను పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి..,పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయాలు, వాలంటీర్ల బాధ్యతను పురపాలక శాఖ మంత్రి బొత్సకు అప్పగించారు.

మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలకు అదనపు శాఖ బాధ్యతలు
మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలకు అదనపు శాఖ బాధ్యతలు

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల శాఖలను మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల బాధ్యతను పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి.., పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయాలు,వాలంటీర్ల బాధ్యతను పురపాలక శాఖ మంత్రి బొత్సకు అప్పగించారు. గ్రామ, వార్డు సచివాలయాలను ప్రత్యేక విభాగంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం...అప్పటినుంచి ఈ బాధ్యతలను ఎవరికీ అప్పగించలేదు.

గతంలో నోడల్ శాఖగా పంచాయితీరాజ్ గ్రామీణావృద్ధిశాఖకే ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించింది. ప్రస్తుతం దీన్ని ప్రత్యేక విభాగంగా గుర్తించినందున...గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాలు, వాలంటీర్ల పర్యవేక్షణ, నిర్ణయాల బాధ్యతల్ని ఆయా శాఖల మంత్రులకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 166 అధికరణ క్లాజ్‌(3), ఏపీ ప్రభుత్వ బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం గ్రామ/వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు/వార్డు సచివాలయాల శాఖకు సంబంధించి శాఖలను విభజించినట్టు ప్రభుత్వం తెలిపింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details