రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియ చేశారు. కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితులను అధిగమించి, శాంతి, సామరస్యంతో జీవితాన్ని గడపడానికి అవసరమైన శక్తిని విశ్వ జనావళికి ప్రసాదించాలని తాను విగ్నేశ్వరుడిని ప్రార్థిస్తున్నానన్నారు. అధికారులు జారీ చేసిన కొవిడ్ -19 మార్గదర్శకాలు, ఆరోగ్య ప్రోటోకాల్‌లను కచ్చితంగా పాటించాలని, ఇళ్ల వద్దే ఉండి పండుగను జరుపుకోవాలని గవర్నర్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించటంలో అధికార యంత్రాంగానికి సహకరించటం ద్వారా కొవిడ్‌ను జయించవచ్చన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ప్రకటన వెలువడింది.
ఇళ్ల వద్దే చవితి వేడుకలు చేసుకోండని గవర్నర్ విజ్ఞప్తి - vinakachaviti taja news
రాజ్ భవన్ నుంచి గవర్నర్ వినాయకచవితికి సంబంధించి ప్రకటన విడుదల చేశారు. అధికారులు జారీ చేసిన కొవిడ్ -19 మార్గదర్శకాలు, ఆరోగ్య ప్రోటోకాల్‌లను కచ్చితంగా పాటించాలని, ఇళ్ల వద్దే ఉండి పండుగ జరుపుకోవాలని గవర్నర్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

governor release press note on vinayakachavithi festival precautions