లాక్ డౌన్ దృష్ట్యా రాష్ట్రంలో ఇంటింటికీ పండ్లు, కూరగాయలు సరఫరా చేసేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ ఆహార సరఫరా సంస్థ స్విగ్గీ తెలిపింది. తాజా కూరగాయలు, పండ్లను డోర్ డెలివరీ చేయనున్నట్లుగా స్విగ్గీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. ఏపీ మార్కెటింగ్ శాఖ భాగస్వామ్యంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసేందుకు ఈ సేవలు అందించనున్నట్లు వివరించింది. ఇలాంటి సమయంలో తమకు అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని స్విగ్గీ... ట్విట్టర్లో తెలిపింది.
స్విగ్గీ భాగస్వామ్యంతో ఇంటింటికీ పండ్లు, కూరగాయలు
రాష్ట్రంలో ఇంటింటికీ పండ్లు, కూరగాయలు సరఫరా చేసేందుకు సిద్ధమైనట్లు ప్రముఖ ఆహార సరఫరా సంస్థ స్విగ్గీ తెలిపింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేసేందుకు ఈ సేవలు అందించనున్నట్లు వివరించింది.
స్విగ్గీ భాగస్వామ్యంతో ఇంటింటికీ పండ్లు