రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారాన్ని ఆ శాఖ చేపట్టింది. విద్యుత్తు ఉపకరణాలు వినియోగించే సమయం, ఇతర పరిస్ధితులలోనూ సంభవించే ప్రమాదాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన తీరును వివరించింది. ఈ వారోత్సవాలు నేటి నుంచి ఈ నెల 20 వరకు నిర్వహించనున్నారు.
కృష్ణా జిల్లాలో..
విధి నిర్వహణలో మృతిచెందిన అగ్నిమాపక సిబ్బందికి అధికారులు నివాళులర్పించారు. విజయవాడ అగ్నిమాపక ప్రధాన కార్యాలయంలో ఫైర్ సర్వీస్ వీక్‌ను ఆ శాఖ డైరక్టర్ జయరాం నాయక్ ప్రారంభించారు. అగ్నిప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రమాదాల్లో బాధితులను రక్షించడం, మంటలు త్వరితగతిన అదుపులోకి తెచ్చేందుకు అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం
గన్నవరంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక తహసీల్దార్ నరసింహారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాదాల నివారణపై విద్యార్థులు, ప్రజలకు అగ్నిమాపకశాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు అవగాహన కల్పించారు. విధిలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి అధికారులు నివాళులు అర్పించారు.
కడప జిల్లాలో..
తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడటంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది ముందుంటారని జిల్లా అగ్నిమాపక అధికారి హనుమంతరావు అన్నారు. కడప అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు. అగ్ని ప్రమాదాలకు నివారణకు సంబంధించి ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం అగ్ని నిరోధక పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు.
ప్రకాశం జిల్లాలో...