రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అనంతపురం జిల్లా పెనుకొండ(ananthapuram district penugonda) నగర పంచాయతీలోని 20 వార్డుల్లో తెలుగుదేశం నేతలు(TDP leaders) ప్రచారం చేశారు. కొండాపురంలో హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప(nimmala kishtappa), తెదేపా రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవితమ్మ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కడప జిల్లా కమలాపురం(kamalapuram)లో మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీ ప్రచారం చేశాయి. తెలుగు యువత కార్యకర్తలు మూడురోడ్ల కూడలిలో ఓట్లు అభ్యర్థించారు.
ఇంటింటికీ ప్రచారం...
కర్నూలు జిల్లా నంద్యాల(nandyala) మండలం బిల్లాలపురంలో జడ్పీటీసీ ఎన్నికల్లో(ZPTC elections) భాగంగా వైకాపా నాయకులు ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించారు. అభ్యర్థి గోకుల్ రెడ్డితో కలిసి శాసనసభ్యుడు శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి(MLA shilpa ravichandra kishore reddy) ప్రచారంలో పాల్గొన్నారు. నంద్యాల మండలం పులిమద్దిలో తెలుగుదేశం అభ్యర్థి అరుణ తరఫున మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి(bhuma brahmananda reddy) ప్రచారం నిర్వహించారు. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో ప్రచారం జోరుగా సాగింది. తెలుగుదేశం అభ్యర్థుల తరపున అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్(gottipati ravi kumar), పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు(parchurur MLA eluri sambashivarao) ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు.