ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

suresh on schools : ఆగ‌స్టు 16న పాఠ‌శాల‌లు పునఃప్రారంభిస్తాం:మంత్రి సురేష్‌ - suresh on schools

ఆగ‌స్టు 16న పాఠ‌శాల‌లు పునఃప్రారంభిస్తామని(schools reopen) విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్(minister suresh) అన్నారు. ఉపాధ్యాయుల‌కు ఆగ‌స్టు16లోగా 100శాతం బూస్టర్ డోస్ వ్యాక్సిన్ పూర్తిచేయాల‌ని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.

august 16th Schools Reopen at Andhra pradesh
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్

By

Published : Jul 29, 2021, 3:25 PM IST

Updated : Jul 29, 2021, 4:11 PM IST

ఆగ‌స్టు 16న పాఠ‌శాల‌లు పునఃప్రారంభం

ఆగ‌స్టు 16న రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠ‌శాల‌లు పునఃప్రారంభిస్తామని(schools reopen) విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ పునరుద్ఘాటించారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలు తెరుస్తున్నామన్నాారు. ఉపాధ్యాయుల్ని విద్యార్థుల ఇంటికి పంపి సన్నద్ధతకు ఏర్పాట్లు చేస్తున్నారని మంత్రి వివరించారు. ఉపాధ్యాయుల‌కు ఆగ‌స్టు16లోగా 100శాతం బూస్టర్ డోస్ వ్యాక్సిన్ పూర్తిచేయాల‌ని సీఎం జగన్​ ఆదేశించినట్లు తెలిపారు.

నాడు-నేడు ప‌నులు 98శాతం పూర్తయ్యాయని.. ఆగస్టు 16న సీఎం జగన్ వీటిని ప్రజ‌ల‌కు అంకితం చేస్తారని పేర్కొన్నారు. అదేరోజు నాడు-నేడు(naadu needu) రెండోదశ కింద రూ. 4వేల కోట్లతో 16వేల స్కూళ్ల రూపురేఖ‌లు మార్చే కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు. అమ్మ ఒడి వ‌ద్దన్న 9 ల‌క్షల మంది, డిగ్రీ కాలేజీల్లో వ‌స‌తి దీవెన వ‌ద్దనుకుంటున్న విద్యార్థులకు వ‌చ్చే విద్యాసంవ‌త్సరం నుంచి ల్యాప్​ట్యాప్​లు ఇస్తామన్నారు.

Last Updated : Jul 29, 2021, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details