Subrahmanyam parents on Murder Enquiry: వైకాపా పాలకులకు దళితుల ప్రాణాలంటే లోకువ అని ఎమ్మెల్సీ అనంతబాబు(ఉదయభాస్కర్) చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. ప్రభుత్వం జరిపించే విచారణ మీద తమకు నమ్మకం లేదని.. అందుకే సీబీఐ విచారణ జరిపించాలని కోరుతున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబుని వారు కలిశారు.
దళితుల ప్రాణాలంటే వైకాపాకు లోకువ.. సుబ్రహ్మణ్యం తల్లిదండ్రుల ఆవేదన
Subrahmanyam parents Meet CBN: తమకు అన్ని విధాలా అండగా ఉంటానని అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీ అనంతబాబు(ఉదయభాస్కర్) చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబుని కలిసిన వారు.. ఈ కేసులో ప్రభుత్వం జరిపించే విచారణ మీద తమకు నమ్మకం లేదని వాపోయారు.
ఎమ్మెల్సీ ఆనంతబాబు.. తమ కొడుకును అన్యాయంగా చంపేశాడంటూ చంద్రబాబు ఎదుట ఆ కుటుంబసభ్యులు బోరున విలపించారు. తమ కుమారుడు హత్య కేసులో పోలీసుల ద్వారా న్యాయం జరగలేదని వాపోయారు. నిందితుడు ఆనంతబాబుని కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని వారు ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపించాలనే తమ డిమాండ్‌ను పట్టించుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా.. అన్ని విధాలా అండగా ఉంటానని చంద్రబాబు భరోసా ఇచ్చినట్లు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు చెప్పారు. సీబీఐ విచారణ జరిపించేలా తనవంతు ఒత్తిడి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.
ఇదీ చదవండి: