రాజ్యాంగ వ్యవస్థను కాపాడతానన్న జగన్ కక్షతో వ్యవహరిస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. పోలవరం పనులు ఆపడం, రైతులకు అన్యాయం చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. గడ్కరీ అనుమతితో గత తెదేపా ప్రభుత్వం నవయుగ ద్వారా పోలవరం పనులు 70శాతం పూర్తి చేసిందని... సౌలభ్యం కోసం పెట్టుకున్న క్లాజును అడ్డం పెట్టుకుని పనులు నిలిపివేశారని ఆయన అన్నారు. కోర్టు సైతం ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని... అయినా న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
'చంద్రబాబుకు పేరు వస్తుందనే.. జగన్ కక్ష'
పోలవరం పనులు మరింత ఆలస్యం అవుతాయని అందరూ చెబుతున్న జగన్ మూర్ఖత్వంతో ముందుకు వెళుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థను కాపాడతానన్న జగన్.. కక్షతో వ్యవహరిస్తున్నారన్నారు. పోలవరం పూర్తైతే చంద్రబాబుకు పేరు వస్తుందనే భయం జగన్‌లో కనిపిస్తుందన్నారు.
చంద్రబాబుపై కక్షతోనే...
పోలవరం విషయంలో చంద్రబాబు పేరు ఎక్కడా కనిపించకూడదనే అక్కసు జగన్‌లో కనిపిస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం నుంచి ఉన్న వెంకటేశ్వరరావును తొలగించడం అన్యాయమని దేవినేని విచారం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ చీఫ్ హోదాలో నలుగురు సీఎంల వద్ద ఆయన పని చేశారని... కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెచ్చిన అధికారిగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. నలుగురు ముఖ్యమంత్రులకు మంచి అధికారిగా ఉన్న వెంకటేశ్వరరావును ఏకారణంతో తప్పించారని సీఎం జగన్‌ను దేవినేని ఉమ ప్రశ్నించారు.
ఇవీ చూడండి-పోర్టల్‌లో పోలవరం టెండర్ వివరాలు