ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 21, 2019, 11:01 PM IST

ETV Bharat / city

'రైతులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తెదేపా, వైకాపాదే'

కేంద్ర మాజీ మంత్రి, భాజపా మహిళా మోర్చా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరిని రాజధాని గ్రామాల రైతులు కలిశారు. అమరావతి రాజధాని ప్రాంతాన్ని వేరే చోటకు మార్చకుండా చూడాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

daggubat purandeswari about capital amaravathi
daggubat purandeswari about capital amaravathi

'రైతులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తెదేపా, వైకాపాదే'

రాజధానిని మార్చకుండా చూడాలని కోరుతూ... అమరావతి పరిధిలోని రైతులు కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి వినతిపత్రం అందజేశారు. అయితే... అభివృద్ధి వికేంద్రీకరణను మొదటి నుంచి భాజపా సమర్థిస్తోందని పురందేశ్వరి అన్నారు. తెదేపా, వైకాపాలు రెండూ... రైతులకు సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. పార్టీల కోసం రైతులు తమ భూములను ఇవ్వలేదని... ప్రభుత్వానికి మాత్రమే రైతులు భూములిచ్చారని గుర్తు చేశారు. కేంద్రప్రభుత్వం నిధులు ఇచ్చినా గత ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేయలేదని ఆరోపించారు. ప్రభుత్వం నియమించిన జీఎన్​రావు కమిటీ నివేదిక పూర్తిగా బహిర్గతం కావాలన్నారు. మంత్రివర్గ సమావేశాల సమయంలోనైనా రైతుల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని పురందేశ్వరి కోరారు.

ABOUT THE AUTHOR

...view details