రష్యాలో అక్టోబరు విప్లవం విజయవంతమై లెనిన్ నాయకత్వంలో సోషలిజం అజేయంగా దశాబ్దాల పాటు నడిచిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు. విజయవాడలో సోషలిజాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, 15 రోజులపాటు సోషలిజంపై ప్రజలకు వివరిస్తామన్నారు. అమెరికాలో ట్రంప్ ఓటమితో మార్పు ప్రారంభమైందని... ఆ మార్పు ప్రపంచవ్యాప్తంగా వస్తుందన్నారు.
భాజపాకు కూడా భవిష్యత్తులో ప్రజలు బుద్ధి చెబుతారని రాఘవులు అన్నారు. కరోనాను అరికట్టడంలో భాజపా పూర్తిగా విఫలమైందన్నారు. వైకాపా, తెదేపా కొన్ని సందర్భాల్లో భాజపా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాయని ఇది భవిష్యత్లో చాలా ప్రమాదకరమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఈ 15 రోజుల ప్రచార కార్యక్రమంలో ప్రజలకు వివరిస్తామన్నారు.