పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గించాలని.. విజయవాడలో సీపీఎం(CPM) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఏకంగా 19 సార్లు పెట్రోల్ ధరలను పెంచారని సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మండిపడ్డారు. లీటర్ పెట్రోల్ ధరను సెంచరీ దాటించారన్నారు .రవాణా రంగాన్ని ఉపాధిగా చేసుకుని జీవిస్తున్న నిరుద్యోగ యువత, ఆటో కార్మికులు పెరిగిన ధరలతో ఇబంది పడుతున్నారన్నారు.పెరిగిన ధరలపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం నోరు మెదపకపోవడం దారుణమన్నారు.తక్షణమే పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువచ్చి పెరిగిన ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు.
CPM:'పెంచిన పెట్రోలు ధరలు వెంటనే తగ్గించాలి' - పెట్రోలు ధరలు తగ్గించాలని సీపీఎం నిరసన
పెరిగిన పెట్రోలు ధరలను వెంటనే తగ్గించాలని.. సీపీఎం(CPM) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఏకంగా 19 సార్లు పెట్రోల్ ధరలను పెంచారని సీపీఎం(CPM) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మండిపడ్డారు.

protest
TAGGED:
petrol prices latest news