దేశంలో మోదీ, రాష్ట్రంలో జగన్ పరిపాలనా విధానాలపై.. కలసివచ్చే వామపక్ష, లౌకిక, ప్రజాస్వామిక శక్తులతో ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఉందని సీసీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమితి సమావేశం జరిగింది. దేశ, రాష్ట్ర రాజకీయాలు, అనుసరించాల్సిన ఉద్యమాలపై సమావేశంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకుందన్నారు. పార్టీ నిర్దిష్టంగా ప్రతివక్ష వైఖరి అవలంభించాలని తీర్మానించినట్లు ఆయన తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ఉద్యమిస్తాం: రామకృష్ణ రాష్ట్రమంతా అప్పులమయం..
వైకాపా పాలనలో రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని.. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఎన్నికల ముందు 2.35 లక్షల ఉద్యోగాలిస్తామంటూ హామీ ఇచ్చి.. ఇప్పుడు కేవలం 10,143 ఉద్యోగాలతోనే సరిపెట్టడం నిరుద్యోగులను మోసగించడమే అన్నారు. రాష్ట్రంలో ఏ రంగాన్ని బలోపేతం చేయలేదన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు హామీ కోసం ఉద్యోగ సంఘాలు పోరాటానికి సమాయాత్తమయ్యాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఎక్కడా లేదన్నారు. రాష్ట్రంలో కక్షసాధింపు చర్యలు అధికమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి...
PATTABHI: 'గవర్నమెంట్ ఆర్డర్ అనే పదానికి కొత్త అర్థం చెప్పారు'