విశాఖ ఉక్కు కర్మాగారంపై ఐక్య పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు సీఎం తీసుకెళ్లాలని కోరారు. 2019 లోనే పోస్కో సంస్థతో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ఒప్పందం చేసుకున్నట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారని.. ఇది సీఎం జగన్కు తెలియకుండానే జరిగిందా అని ప్రశ్నించారు.
ఎయిమ్స్ ఎందుకు ఆలస్యం అయిందని పార్లమెంట్లో ప్రశ్నిస్తే కేంద్రమంత్రి ఇసుక దొరలేదని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని సీపీఐ రామకృష్ణ అన్నారు. వాలంటీర్లకు రూ.12 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.