సీఎం జగన్మోహన్ రెడ్డి నాడు రాజధానిగా అమరావతిని స్వాగతించారా.. లేదా..? అని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి జగన్ అందరినీ మోసం చేస్తున్నారని అన్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధానాలు విడనాడాలని సూచించారు.
మాట నిలబెట్టుకోవడమంటే.. ముఖం చాటేయడం కాదు: శైలజానాథ్
మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి జగన్ అందరినీ మోసం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. రాజధాని ప్రాంత రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
congress leader
అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని.. రాజధాని ప్రాంత రైతులు ఇప్పటికీ నమ్ముతున్నారన్నారు. హోదా అంశం, రాష్ట్ర ప్రయోజనాలపై భాజపా మంత్రుల వైఖరి చూశాక కూడా.. ప్రధాని మోదీని నమ్మడం శోచనీయమన్నారు. రాజధాని ప్రాంత రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని.. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:వరద బాధితులకు రామోజీ గ్రూప్ రూ.5 కోట్ల సాయం