విజయవాడ ఆత్కూరు పోలీసుస్టేషన్ పరిధిలోని వీరపనేనిగూడెంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ఏపీ కోపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్‌కు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు దుర్వినియోగం, దారిమళ్లింపు జరిగినట్లు ఆ సంస్థ మేనేజర్ చలపాక రమణమూర్తి ఈనెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఐదు కోట్ల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను నకిలీ పత్రాలు సృష్టించి ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ ఉద్యోగుల సంతకాలను ఫోర్జరీ చేసి వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించి దుర్వినియోగం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు.
ఈ ఏడాది మేలో ఈ కుంభకోణం జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్‌కు చెందిన 9 కోట్ల 60 లక్షల రూపాయల ఫిక్స్‌డ్ డిపాజిట్లను భవానీపురం ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకులో ఉంచారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఉద్యోగుల సంతకాలు, నకిలీ ధ్రువపత్రాలతో కరెంట్ అకౌంట్ తెరిచి