గన్నవరం మండలం సూరంపల్లి గ్రామ సమీపంలో బ్లేడు బ్యాచ్ హల్చల్ చేసింది. పోలవరం కాలువ వెంట వెళ్తున్న వారిని బెదిరించి డబ్బులు, సెల్ఫోన్లు, ఓ బైక్ లాక్కొన్నారు.
బైక్పై పారిపోతున్న బ్లేడ్ బ్యాచ్లో ఒకరిని పట్టుకున్న సూరంపల్లి గ్రామస్తులు.. ఆ వ్యక్తిని తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.