ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాపై పోరుకు సీఎం సహాయనిధికి విరాళం - Vijayarai Village farmers donation to CM Relief Fund

కొవిడ్-19ను ఎదుర్కునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. పలు ప్రైవేట్​ ఆసుపత్రుల యాజమాన్యాలు అందుకు సహకరిస్తున్నాయి. ఏపీ ప్రైవేట్‌ మెడికల్‌ అండ్ డెంటల్‌ కాలేజెస్‌ అసోసియేషన్‌ రూ.2కోట్లు విరాళం ప్రకటించింది.

కరోనాపై పోరుకు సీఎం సహాయనిధికి విరాళం
కరోనాపై పోరుకు సీఎం సహాయనిధికి విరాళం

By

Published : Apr 24, 2020, 6:35 AM IST

రూ.2 కోట్లు విరాళం

ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఐఎంఏ ప్రతినిధులు ముందుకొచ్చారని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్​.పిగిలం శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు విరాళం ఇచ్చిన ఏపీ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ ప్రతినిధుల దాతృత్వాన్ని వీసీ అభినందించారు. కొవిడ్​-19 సహాయక చర్యలపై నిర్వహించిన సమావేశంలో వీసీ ఐఎంఏ ప్రతినిధులతో చర్చించారు.

సీఎం సహాయనిధికి రైతులు విరాళం

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన రైతులు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1.15లక్షలు విరాళం ఇచ్చారు. స్థానిక సహకార సంఘం ఆవరణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి ఇందుకు సంబంధించిన చెక్కులను రైతులు అందజేశారు.

ఇదీ చూడండి:సీఎం సహాయ నిధికి నాలుగేళ్ల బుడతడి విరాళం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details