ఇప్పటికే వేర్వేరు కారణాల వల్ల రెండు సార్లు వాయిదా పడిన రాష్ట్ర కేబినెట్ సమావేశం రేపు (మంగళవారం) సచివాలయంలో జరుగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన మొదటి బ్లాక్‌లోని సమావేశ మందిరంలో మంత్రివర్గం భేటీ కానుంది.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ విధించే అంశాన్ని కేబినెట్ ఆమోదించనుంది. ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, వ్యాప్తి నిరోధక చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. వీటితోపాటు గతంలో పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.