ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రామోజీ ఫిల్మ్​సిటీలో 14న అంతర్జాతీయ సదస్సు - మోటమోర్సోసిస్‌ అనే సంస్థ డిసెంబర్‌ 14వ తేదీన ఈ సదస్సు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిల్మ్​సిటీ మరో అంతర్జాతీయ గ్లోబల్‌ స్కూల్‌ ప్రిన్యూర్‌ సమ్మిట్‌ సదస్సుకు వేదికకానుంది. విద్యార్థులలో దాగియున్న విన్నూత ఆలోచనలకు ఒక వేదిక కల్పిస్తూ....వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్న మోటమోర్‌సోసిస్‌ అనే సంస్థ డిసెంబర్‌ 14వ తేదీన ఈ  సదస్సు నిర్వహిస్తుంది.

a-selection-of-innovative-ideas-for-students-hyderbad

By

Published : Nov 17, 2019, 1:03 PM IST

రామోజీ ఫిల్మ్​సిటీలో 14న అంతర్జాతీయ సదస్సు

అంతర్జాతీయ గ్లోబల్‌ స్కూల్‌ ప్రిన్యూర్‌ సమ్మిట్​తో సరికొత్త ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ సీఈఓ పవన్‌ తెలిపారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలకు 203 మంది విద్యార్థులను ఎంపిక చేశామని చెప్పారు. వీరిలో నుంచి 30 మందిని ఫైనల్‌కు ఎంపిక చేస్తామన్నారు. వీరందరికి డిసెంబర్‌ 14వ తేదీన రామోజీ ఫిల్మ్​సిటీలో ఫైనల్‌ పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థల్లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. వినూత్నంగా ఆలోచించే విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంతోపాటు ప్రతిభావంతులైన యువకులను వెలికితీసేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి సమ్మిట్‌ను దేశంలో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details