తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల పేరుతో మోసగిస్తున్న దళారులపై ఫిర్యాదులు అందాయని తితిదే తెలిపింది. తితిదేకల్యాణోత్సవం, రూ.300 టికెట్లు బుక్ చేస్తామని మోసం చేసినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. టికెట్లు ఇస్తామని రేవతి ట్రావెల్స్ డబ్బు వసూలు చేసినట్లు వెల్లడించింది. ఆ సంస్థపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. భక్తులు tirupatibalaji.ap.gov.in ద్వారా మాత్రమే టికెట్లు తీసుకోవాలని తితిదే సూచించింది. ఇతర వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని తెలిపింది. స్వామివారి దర్శన టికెట్లతో వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
TTD: ఫేక్ సైట్లను నమ్మవద్దు.. - Fraud in the name of special darshan tickets in Thirumala
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శన టికెట్ల పేరిట మోసాలపై తితిదే చర్యలు చేపట్టింది. ఓ ట్రావెల్స్ సంస్థ.. భక్తుల నుంచి సొమ్ము తీసుకొని.. మోసాలకు పాల్పడుతున్నట్లు తితిదే అధికారులు తెలిపారు.

తితిదే