తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తెదేపా మహిళా కార్యకర్తలు వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర, కూరగాయల ధరలను సూచించేలా హారాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే తిరుపతి ఉప ఎన్నికలో పనబాక లక్ష్మికి మద్దతివ్వాలన్నారు.
మన సమస్యల మీద పోరాడి వాటి సాధనకు కృషి చేసే పనబాక లక్ష్మిని గెలిపించాలని కోరారు. ఓట్ ఫర్ సైకిల్ అంటూ నినాదాలు చేస్తూ.. ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు.