Tamil Nadu devotees Concern : తిరుపతిలోని అలిపిరి సమీపంలోని గరుడ కూడలి వద్ద తమిళనాడు భక్తబృందం ఆందోళనకు దిగింది. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించడంపై 500 మంది భక్తులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. వందల కిలోమీటర్ల దూరం నుంచి పాదయాత్రగా వచ్చిన తమకు స్వామివారి దర్శనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 26 ఏళ్లుగా వేలూరు జిల్లా గుడియాత్తం నుంచి పాదయాత్రగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నట్లు భక్తులు తెలిపారు. అదే తరహాలో ఈసారి కూడా వచ్చామన్నారు. ఆన్ లైన్లో 150 మందికి దర్శన టికెట్లు లభించగా... బృందంలోని మరో 350 మందికి దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు దర్శన భాగ్యం కల్పించాలని తితిదే ఛైర్మన్‌ను కోరినా స్పందించలేదని వాపోతున్నారు.
అలిపిరిలో తమిళనాడు భక్తుల ఆందోళన
Tamil Nadu devotees Concern : తిరుపతిలోని అలిపిరిలో తమిళనాడు భక్తులు ఆందోళన చేపట్టారు. శ్రీవారి దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించడంపై నిరసన వ్యక్తం చేశారు. వందల కిలో మీటర్లు పాదయాత్రగా వచ్చిన తమకు స్వామి వారి దర్శనం కల్పించాలంటూ భక్తులు డిమాండ్ చేశారు. 26 ఏళ్లుగా పాదయాత్రగా వచ్చి దర్శించుకుంటున్నామని.. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదన్నారు.
Concern