'రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి'
కేంద్ర ప్రభుత్వం మార్కెట్ సంస్కరణల పేరుతో తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల నాయకుడు కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో మంగళం ఆర్టీవో కార్యాలయం వద్ద శెట్టిపల్లి పంచాయతీ రైతులు, జిల్లా రైతు సంఘాల నాయకులు నిరసన చేశారు.
రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలని.. రైతు సంఘాల నాయకుడు కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో మంగళం ఆర్టీవో కార్యాలయం వద్ద శెట్టిపల్లి పంచాయతీ రైతులు, జిల్లా రైతు సంఘాల నాయకులు వినూత్న నిరసన చేశారు. శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం నిర్వహించారు. దిల్లీలో గత మూడు వారాలుగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలో ఇప్పటివరకు 30 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. వారి మృతికి సంతాపంగా ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐటీయూసీ ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతు సంఘాల జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
రైతు నుంచి లంచం తీసుకున్న వీఆర్వో.. వైరల్ అవుతున్న వీడియో..
TAGGED:
thirupathi newsupdates