తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను తితిదే వైభవంగా నిర్వహించింది. ఈ నెల 13న వైకుంఠ ఏకాదశిని పురష్కరించుకుని ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేకువజామున సుప్రభాతం, అర్చన సేవల అనంతరం శ్రీవారి మూలవిరాట్టుపై పట్టు వస్త్రంతో అర్చకులు పూర్తిగా కప్పివేశారు. నాముకోపు, శ్రీ చుర్ణం, కస్తూరి పనువు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలిపి పవిత్ర జలంతో ప్రదక్షణంగా వెళ్లి ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆనందనిలయం, బంగారువాకిలి శ్రీవారి ఆలయంలోని ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పూజాసామాగ్రి తదితర అన్ని వస్తువులను శుభ్రపరిచారు. ఉదయం 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని అర్చకులు, తితిదే సిబ్బంది నిర్వహించారు.
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం - ttd
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తితిదే ఆలయాన్ని శుద్ధి చేస్తోంది. ఆలయ శుద్ధి కారణంగా ఉదయం 11 గంటల వరకు భక్తులకు దర్శనం నిలిపివేశారు.

koilallwar tirumanjanam at tirumala
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
అనంతరం స్వామివారికి కప్పబడి ఉన్న వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేధ్యం సమర్పించిన తర్వాత.. భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఆలయ శుద్ధి కార్యక్రమంలో అదనపు ఈవో ధర్మారెడ్డితో పాటు అర్చకులు, తితిదే సిబ్బంది పాల్గొన్నారు. వైకుంఠం ద్వార దర్శనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని ఏఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ రోజు అద్దె గదుల కేటాయింపు నిలిపివేస్తున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి:
TTD VAIKUNTA DARSHANAM: ముగిసిన వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ
Last Updated : Jan 11, 2022, 11:40 AM IST