'కరోనా నుంచి తితిదే పెద జీయర్ స్వామి త్వరగా కోలుకోవాలి'
తితిదే పెద జీయర్ పూజ్య శ్రీ శఠగోప రామానుజ పెద జీయంగార్ స్వామి కరోనా బారిన పడ్డారు. మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకొవాలని ఆకాంక్షిస్తూ నారా చంద్రబాబు, లోకేశ్ ట్వీట్ చేశారు.
'కరోనా నుంచి తితిదే పెద జీయర్ స్వామి త్వరగా కోలుకోవాలి'
ఆధ్యాత్మికవేత్త, తిరుమల తిరుపతి దేవస్థానం పెద జీయర్, పూజ్య శ్రీ శఠగోప రామానుజ పెద జీయంగార్ స్వామి కొవిడ్ 19 బారిన పడటం విచారకరమని తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు విచారం వ్యక్తం చేశారు. త్వరగా కోలుకుని స్వామి సేవలో పునరంకితులవ్వాలని వేంకటేశ్వర స్వామిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.