ముఖ్యమంత్రి జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా తిరుపతి పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కరోనా కేసులు, మరణాలు పెరిగాయన్న సీఎం జగన్..రెండు జిల్లాల్లోని ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తన ప్రచార సభను రద్దు చేసుకుంటున్నట్లు ప్రజలకు వివరించారు.
సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు
సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు
15:34 April 10
సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు
తాను ప్రచారానికి రాలేకపోయినా..వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తుంచుకుంటారని..తమ దీవెనలు అందిస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్న గురుమూర్తిని..గతంలో కంటే భారీ ఆధిక్యంతో గెలిపించాలని లోక్‌సభ పరిధిలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి
Last Updated : Apr 10, 2021, 4:11 PM IST