అత్యాచార బాధితురాలిని దత్తత తీసుకున్న తెదేపా
16:38 July 23
రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేత
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అత్యాచార బాధితురాలిని తెదేపా దత్తత తీసుకుంది. బాధితురాలికి తక్షణ సాయం కింద రూ.2 లక్షలు అందించింది. తెదేపా నిజనిర్ధరణ కమిటీ.. నివేదికను చంద్రబాబుకు అందజేసింది. బాధితురాలి పరిస్థితి విన్న చంద్రబాబు.. చలించిపోయారు. ఆమెను పార్టీ తరఫున దత్తత తీసుకుని.. చదివిస్తామని ప్రకటించారు. బాధితురాలిలో ఆత్మవిశ్వాసం కలిగించాలని.. తెదేపా అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని నాయకులకు చంద్రబాబు సూచించారు. ఇటువంటి దుర్మార్గాలపై పోరాడే యోధురాలిలా ఆమెను తీర్చిదిద్దాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
కొవిడ్ బాధితులకు అవమానం.... మహిళను ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న యజమాని