ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆర్​ఎఫ్ఐడీల విభాగం మూసివేతతో.. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇబ్బందులు - తూర్పుగోదావరి జిల్లా వార్తలు

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆర్ఎఫ్ఐడీలు వేసే విభాగం మూతపడింది. శిశువులను గుర్తించేందుకు వీలుగా ప్రస్తుతం చేతికి మామూలు ట్యాగులు వేస్తున్నారు.

శిశువుకు మామూలు ట్యాగు వేస్తున్న ఆస్పత్రి సిబ్బంది
శిశువుకు మామూలు ట్యాగు వేస్తున్న ఆస్పత్రి సిబ్బంది

By

Published : Mar 23, 2021, 5:21 PM IST

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రసూతి విభాగంలో అప్పుడే పుట్టిన శిశువు చేతికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ వేసేవారు. శిశువులు మారకుండా, అపహరణకు గురికాకుండా ఇవి ఎంతగానో ఉపయోగపడేవి. శిశువును బయటకు తీసుకెళ్లాల్సివచ్చినప్పుడు, డిశ్చార్జి అయినప్పుడు సంబంధిత విభాగంలో నమోదు చేసుకొని వెళ్లేవారు.

కరోనా నేపథ్యంలో ఏడాదిగా ఆర్ఎఫ్ఐడీలు వేసే విభాగం మూతపడింది. ఆసుపత్రి సూపరెంటెండెంట్ డాక్టర్ జి. సోమసుందరరావును వివరణ కోరగా ఆర్ఎఫ్ఐడీలు వేసే విభాగాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి శిశువులను గుర్తించేందుకు వీలుగా చేతికి మామూలు ట్యాగులు వేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details