ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నాటుసారా స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ - తూర్పోగోదావరి జిల్లాలో ఎస్​ఈబీ దాడులు

తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఎస్​ఈబీ పోలీసులు దాడులు నిర్విహించారు. భారీగా నాటుసారాను ధ్వంసం చేశారు. సారా విలువ రూ. 50 లక్షల వరకు ఉంటుందని వారు వెల్లడించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు.

50 lacks worth natusara destroyed by seb police
50 lacks worth natusara destroyed by seb police

By

Published : Jul 30, 2021, 10:58 PM IST

నాటుసారా ధ్వంసం చేస్తోన్న పోలీసులు

తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఎస్‌ఈబీ పోలీసులు నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ గ్రామీణ మండలం నేమం వద్ద 20,479 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు. దీని విలువ 50 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి చింతపల్లి వైపు తరలిస్తున్న 8,800 నాటు సారా ప్యాకెట్లతో పాటు... 240 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని... ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వాహనం సీజ్ చేసినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details