నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం గ్రామానికి తెదేపా నేతల బృందం వెళ్లింది. కొవిడ్‌కు ఆనందయ్య మందు తయారు చేసే ప్రాంతాలను పరిశీలించారు. మందు తయారీలో వినియోగిస్తున్న ఆకుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇంతకు ముందు ఆనందయ్య ఇచ్చిన మందు వాడిన వారితో మాట్లాడారు. దీనికి అధికారులు అనుమతులు ఇవ్వాలని వారు కోరారు. కరోనా బాధితులకు ఈ మందు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. తెదేపా బృందంలో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీదా రవిచంద్ర, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.