ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Power Cuts: అప్రకటిత విద్యుత్ కోతలు... ప్రజలకు తప్పని తిప్పలు

Power cuts: విద్యుత్‌ కోతలు.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో కోతల సమస్య ఎక్కువగా ఉంది. కరెంట్ రాక, పోక తెలియని పరిస్థితి నెలకొంది. అప్రకటిత కోతలతో జనానికి యాతన తప్పడం లేదు.

Power cuts problems
విద్యుత్ కోతలతో ప్రజల ఇక్కట్లు

By

Published : Apr 5, 2022, 10:51 AM IST

విద్యుత్ కోతలతో ప్రజల ఇక్కట్లు

Power cuts: గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయి. కరెంట్ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియక ప్రజలు అల్లాడుతున్నారు. అసలే ఎండలు మండిపోతున్న సమయంలో.. మధ్యాహ్నం, రాత్రి వేళ కరెంట్‌ కోతలతో.. ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. కరెంట్‌ కోతల వల్ల ఇంటి పనులు సమయానికి అవడం లేదని గృహిణులు వాపోతున్నారు.

Power cuts: కూలి పనులు చేసి రాత్రి ఇళ్లకు వచ్చిన వారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. నిద్రపోయే సమయంలో ఫ్యాన్లు ఆగిపోవడంతో ఇంట్లో వేడి వాతావరణంతో మగ్గిపోతున్నారు. నెల్లూరు గ్రామీణం, కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉంది. వారం రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ప్రజలు వాపోతున్నారు.

Power cuts: కరెంట్‌ కోతల వల్ల ఉద్యోగులూ ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్‌ లేకపోవడం వల్ల బయోమెట్రిక్‌ వేయలేకపోతున్నామంటున్నారు. కరెంట్‌ లేకపోవడం వల్ల ఆసుపత్రుల్లో వైద్యసేవలకు అంతరాయం కలుగుతుందని వైద్య సిబ్బంది అంటున్నారు. ఎడాపెడా కరెంట్‌ కోతల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్న ప్రజలు.. కోతలకు నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: విద్యుత్ చార్జీల పెంపుపై.. తెదేపా రాష్ట్రవ్యాప్త నిరసనలు

ABOUT THE AUTHOR

...view details