పట్టణ గృహ నిర్మాణంలో అవినీతి అవాస్తవమని మాజీ మంత్రి, తెదేపా నేత నారాయణ స్పష్టం చేశారు. తెదేపా ప్రభుత్వంలో చదరపు అడుగుకు 1,546 రూపాయల నుంచి 1,651 రూపాయలు మాత్రమే చెల్లింపు జరిగిందని వివరించారు. చదరపు అడుగుకి 2,300 రూపాయలకు పెంచారనేది అవాస్తవమని ఆయన అన్నారు. వ్యాట్ 5శాతం నుంచి, జీఎస్టీ 12శాతం చేయటం వలనే ధర పెరిగిందన్నారు. 2004-14 మధ్య ఏపీ ఇళ్ల నిర్మాణంలో 5 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. షేర్ వాల్ టెక్నాలజీపై జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్‌కు పాలన చేతకాక, తన వైఫల్యాలను తెదేపా ప్రభుత్వంపై నెట్టి విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని నారాయణ దుయ్యబట్టారు.
'పట్టణ గృహ నిర్మాణంలో అవినీతి జరగలేదు'
తెదేపా హయాంలో పట్టణ గృహ నిర్మాణంలో అవినీతి జరిగిందన్న వైకాపా ఆరోపణలను మాజీ మంత్రి నారాయణ ఖండించారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి ఇళ్ల కేటాయించే వరకు అంతా పారదర్శకంగానే జరిగిందని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి నారాయణ
తెదేపా ప్రభుత్వ హయాంలో ఆన్‌లైన్ విధానంలో లబ్ధిదారుల ఎంపిక, నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను లాటరీ వేసి కేటాయించటంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరించామని నారాయణ వివరించారు. నిర్మాణాత్మక వైఖరితో తాము పనిచేస్తే, విధ్వంసక వైఖరితో జగన్ పని చేస్తున్నారని నారాయణ ఆక్షేపించారు.