లంచం తీసుకుంటూ ఓ అవినీతి అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. నెల్లూరులోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఏఈఈగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు రూ.10,600 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కలిగిరి మండలం వీర్నకల్లు గ్రామంలో ఈ ఏడాది జూన్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసినందుకు రూ.5,30,000 బిల్లును తిరుపాల్ రెడ్డి అనే వ్యక్తికి చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లు మంజూరు చేసేందుకు 2 శాతం కమీషన్ ఇవ్వాలని ఏఈఈ డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఏసీబీ వలకు చిక్కిన సహాయక ఇంజినీరు
నెల్లూరు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఏఈఈ శ్రీనివాసులు లంచం తీసుకుంటూ... ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
ఏసీబీ వలలో చిక్కిన సహాయక ఇంజనీరు
TAGGED:
acb ride in nellore