Protest against gas rates hike in Kurnool: గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది. 14.2 కేజీల సిలిండర్ ధరను రూ.50 మేర పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. సాధారణంగా ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ నెల 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను చమురు సంస్థలు ₹183.50 మేర తగ్గించాయి. తాజాగా గృహావసరాల గ్యాస్ ధర మాత్రం పెంచడం గమనార్హం. పెంచిన గ్యాస్ సిలిండర్ ధర ఇవాళ్టి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
గ్యాస్ ధరలు మళ్లీ పెంపు.. ఇల్లు ఎలా గడుస్తుందని మహిళల ఆందోళన - గ్యాస్ ధరలను మరోసారి పెంచిన కేంద్రం
Womens fire on Gas Rates hike: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరను మరోసారి పెంచడంపై కర్నూలులో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అన్ని ధరలు పెరిగి ఇబ్బంది పడుతున్నామని.. ఈ క్రమంలో మరోసారి గ్యాస్ ధరలు పెంపుతో ఇల్లు ఎలా గడుస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

protest against gas rates hike in Kurnool
గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంపై కర్నూలులో మహిళలు మండిపడ్డారు. గృహ వినియోగదారుల సిలిండర్‌పై రూ. 50 పెరగటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయని.. గ్యాస్ ధరలు మరింతగా పెరగటంతో ఇల్లు గడవటం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్యాస్ మంటలు.. కర్నూలులో మహిళలు ఆగ్రహం