కర్నూలు జిల్లాలో అడవుల అభివృద్దికి కృషి చేస్తానని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా కర్నూలు శివారులోని గార్గేయపురం నగరవనంలో మొక్కలు నాటారు. నగరానికి దగ్గరలో వనాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి.. వాటిని సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే... వనం ప్రాముఖ్యతను వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వీరపాండియన్, పాణ్యం, నందికొట్కూరు, పత్తికొండ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆర్థర్, కంగాటి శ్రీదేవి పాల్గొన్నారు.
'మొక్కలు నాటడమే కాదు..వాటిని సంరక్షిచాలి' - Vanam-Manam
ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మొక్కలు నాటడమే కాకుండా... వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. కర్నూలు నగరంలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి