ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ధరల నియంత్రణపై సమీక్షించండి:జిల్లా ఎస్పీ - మైదుకూరుని అధికారులతో అధికారులతో అన్బు రాజన్ సమావేశం

కడప జిల్లా మైదుకూరులో లాక్ ​డౌన్​ అమలుపై జిల్లా ఎస్పీ అన్బురాజన్ అధికారులతో సమావేశమయ్యారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

SP Anbu Rajan met with officials on lockdown implementation in Maiduguar, Kadapa district
SP Anbu Rajan met with officials on lockdown implementation in Maiduguar, Kadapa district

By

Published : Mar 26, 2020, 8:55 PM IST

'ధరల నియంత్రణకు చర్యలు తీసుకోండి'

కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా.. అత్యవసర పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ అన్నారు. మైదుకూరులో లాక్​డౌన్ అమలు ​పై డీఎస్పీ విజయ్​కుమార్, సీఐ మధుసూదన్​గౌడ్​లతో ఆయన సమీక్షించారు. ప్రజలు రహదారులపైకి చేరకుండా ఇంటికే పరిమితమయ్యేలా చైతన్యపరచాలని సూచించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. నిర్ణయాలు తీసుకోవాలన్నారు. విశాలమైన ప్రాంతంలో కూరగాయల మార్కెట్లను ఏర్పాటు చేయాలని డీఎస్పీకి సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details